- Google Pay
ను తెరవండి.
- “మీ డబ్బును మేనేజ్ చేయండి” కింద, లావాదేవీ హిస్టరీని క్లిక్ చేయండి.
- ఇక్కడ, మీరు వివరణాత్మక లావాదేవీ పేజీని చూడడానికి ఏదైనా లావాదేవీని క్లిక్ చేయవచ్చు.
మీ మునుపటి లావాదేవీ హిస్టరీని చెక్ చేయడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించండి
మీ లావాదేవీ హిస్టరీలో Google Pay ద్వారా చేసినవి మాత్రమే ఉంటాయి, అన్ని UPI లేదా బ్యాంకింగ్ లావాదేవీలు ఉండవు. మీరు మీ Google Pay లావాదేవీ హిస్టరీని చూడలేకపోతే, తర్వాతి దశలను ఫాలో అవ్వండి.
1వ దశ: Google Payని అప్‌డేట్ చేయండి
అప్‌డేట్‌ల కోసం చెక్ చేయడానికి, Play Store లేదా App Storeకు వెళ్లండి.
2వ దశ: Google Payలో రిజిస్టర్ చేసిన ఈమెయిల్ అడ్రస్‌ను చెక్ చేయండి
మీరు మీ Google Pay ఖాతా కోసం ఒకటి కంటే ఎక్కువ ఈమెయిల్ అడ్రస్‌లను రిజిస్టర్ చేస్తే, ఈమెయిల్ ఎంపిక దశలను మళ్లీ ఫాలో అవ్వండి.
- Google Pay
ని తెరవండి.
- మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి.
- మీ 10 అంకెల ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- అన్ని యాప్ అనుమతులను ఆమోదించడానికి, అనుమతించండిని ట్యాప్ చేయండి.
- మీ మొబైల్ పరికరంలో రిజిస్టర్ చేసిన Google ఖాతాను ఎంటర్ చేసి, కొనసాగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. చిట్కా: మీరు కొత్త Google ఖాతాను కూడా జోడించవచ్చు.
- మీ Google Pay యాప్
ను సురక్షితంగా ఉంచడానికి, స్క్రీన్ లాక్‌ను ఉపయోగించండి ఆప్షన్‌ను లేదా Google PINను ఉపయోగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: స్క్రీన్ లాక్ కింద, మీరు ఆకృతి లాక్, వేలిముద్ర సెన్సార్, లేదా పాస్‌కోడ్‌ను ఎంచుకోవచ్చు. - బ్యాంక్ ఖాతాను జోడించండి.
మీరు Google Pay ఖాతాను రిజిస్టర్ చేయడానికి ఒక ఈమెయిల్ అడ్రస్‌ను మాత్రమే ఉపయోగించినట్లయితే, 3 నుండి 4 గంటల వరకు వేచి ఉండి, ఆపై మీ లావాదేవీ హిస్టరీని మళ్లీ చెక్ చేయడానికి ట్రై చేయండి. మీరు దాన్ని చెక్ చేయలేకపోతే, అది బలహీనమైన సెల్యులార్ రిసెప్షన్ లేదా నెట్‌వర్క్ కవరేజీ వల్ల కావచ్చు.
కాంటాక్ట్‌కు చెందిన లావాదేవీ హిస్టరీని చెక్ చేయండి
- మీ మొబైల్ పరికరంలో, Google Pay
ను తెరవండి.
- మీ కాంటాక్ట్‌లను కనుగొనడానికి, పైకి స్వైప్ చేయండి.
- లావాదేవీలను, సంభాషణలను చెక్ చేయడానికి, కాంటాక్ట్‌పై ట్యాప్ చేయండి.
పలు Google Pay ఖాతాలకు సంబంధించిన లావాదేవీ హిస్టరీలను విలీనం చేయండి
ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. మీరు యాప్‌లోని ఫీడ్‌బ్యాక్ ఆప్షన్ ద్వారా ఈ సూచనను షేర్ చేయవచ్చు.
లావాదేవీల హిస్టరీలో ఫిల్టర్‌లను ఎలా ఉపయోగించాలి
నిర్దిష్ట లావాదేవీలను కనుగొనడానికి లావాదేవీల హిస్టరీలో ఫిల్టర్‌లను ఉపయోగించండి.
- Google Pay
ను తెరవండి .
- "లావాదేవీల హిస్టరీని చూడండి" ఆప్షన్‌ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
- లావాదేవీ హిస్టరీని చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- కింది ఫిల్టర్‌లలో ఏవైనా వర్తింపజేయండి:
- స్టేటస్: పూర్తయిన, విఫలమైన, లేదా ప్రోగ్రెస్‌లో ఉన్న లావాదేవీలను కనుగొనడానికి.
- పేమెంట్ ఆప్షన్: మీ పేమెంట్ సోర్స్‌ను ఎంచుకోండి.
- బ్యాంక్ ఖాతా
- UPI Lite
- తేదీ: టైమ్‌ఫ్రేమ్‌ను ఎంచుకోండి.
- ఈ నెల
- గత 30 రోజులు
- గత 90 రోజులు
- అమౌంట్: కనిష్ఠ, గరిష్ఠ అమౌంట్‌ను సెట్ చేయండి.
- పేమెంట్ రకం: క్యాష్‌బ్యాక్, అందుకున్న అమౌంట్, లేదా స్వీయ బదిలీల ఆధారంగా ఫిల్టర్ చేయండి.
నిర్దిష్ట సమయానికి చెందిన లావాదేవీ హిస్టరీని చెక్ చేయండి
మీరు "తేదీ" ఫిల్టర్ ద్వారా వివిధ సమయ వ్యవధులకు చెందిన మీ లావాదేవీ హిస్టరీని కనుగొనవచ్చు.
- Google Pay
ని తెరవండి.
- "లావాదేవీల హిస్టరీని చూడండి" ఆప్షన్‌ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
- లావాదేవీ హిస్టరీని చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- తేదీని ఎంచుకోండి.
- డ్రాప్-డౌన్ చిహ్నం నుండి, సమయ వ్యవధిని ఎంచుకోండి.
- ఈ నెల
- గత 30 రోజులు
- గత 90 రోజులు
- వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
Google Pay లావాదేవీ హిస్టరీకి సంబంధించి, PDFను లేదా ఈ-స్టేట్‌మెంట్‌ను పొందండి
ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో లేనందున, మీ లావాదేవీ హిస్టరీ విషయంలో మీరు PDFను కానీ లేదా ఈ-స్టేట్‌మెంట్‌ను కానీ డౌన్‌లోడ్ చేసుకోలేరు. మీ లావాదేవీ హిస్టరీ నుండి నిర్దిష్ట లావాదేవీకి సంబంధించిన వివరాలను షేర్ చేయడానికి, లావాదేవీ వివరాల పేజీకి దిగువున ఉన్న షేర్ చేయండి బటన్‌ను క్లిక్ చేయండి.
Google Pay లావాదేవీ హిస్టరీలో తెలియని అమౌంట్ కనిపిస్తుంది
మీరు అప్‌డేట్ చేయబడిన Google Pay వెర్షన్‌ను కలిగి ఉన్నందున, ఒక కొత్త ఫీచర్ జోడించబడింది, ఇక్కడ మీ లావాదేవీ హిస్టరీలో కనిపించే అమౌంట్ అనేది మీరు ప్రతి నెల అందుకున్న అమౌంట్ నుండి మీ మొత్తం ఖర్చులను తీసివేయగా మిగిలిన అమౌంట్.
సమస్య ఉన్న లావాదేవీని రిపోర్ట్ చేయండి
మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అయిన తర్వాత కూడా లబ్ధిదారుకు అది అందకుంటే, లావాదేవీ గురించి మీరు మీ బ్యాంక్‌కు రిపోర్ట్ చేయవచ్చు.
- మీరు రిపోర్ట్ చేయాలనుకుంటున్న లావాదేవీని తెరవండి.
- సమస్యలు ఉన్నాయి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- సమస్య రకాన్ని ఎంచుకోండి.
మీకు ఇప్పటికీ సమస్యలు ఉన్నట్లయితే, Google Pay సపోర్ట్‌ను సంప్రదించండి.
లావాదేవీ హిస్టరీని తొలగించండి
మీరు Google Payలో మీ లావాదేవీ హిస్టరీని తొలగించినప్పుడు, Google రికార్డ్‌ల నుండి సమాచారాన్ని పూర్తిగా తొలగించడం జరగదు. చట్టపరమైన అవసరాలకు, సర్వీస్ అవసరాలకు అనుగుణంగా ఉండటానికి, కొనుగోళ్లు, నగదు బదిలీలు, రీఫండ్‌ల వంటి లావాదేవీ డేటా నిల్వను Google కొనసాగిస్తుంది. వ్యాపారి లేదా లబ్దిదారు వంటి సంబంధిత లావాదేవీలో ఉన్న ఇతర పార్టీ ఇప్పటికీ వారి యాప్‌లోని “లావాదేవీ హిస్టరీ” పేజీలో తొలగించబడిన లావాదేవీని కనుగొనవచ్చు.
Androidలో మీ Google Pay లావాదేవీ హిస్టరీని తొలగించడానికి, ఈ దశలను ఫాలో అవ్వండి:
- మీ మొబైల్ పరికరంలో, Google Pay యాప్
ను తెరవండి.
- ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
- సెట్టింగ్‌లు
గోప్యత & సెక్యూరిటీ
డేటా & వ్యక్తిగతీకరణ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- Google ఖాతా అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీ Google Pay లావాదేవీలను చెక్ చేయడానికి, నా యాక్టివిటీకి లాగిన్ అవ్వండి.
- లావాదేవీని తొలగించడానికి, మీరు ఇవి చేయవచ్చు:
- తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- చర్యను నిర్ధారించండి.
- యాక్టివిటీని తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- ఫ్రీక్వెన్సీ ఆధారంగా యాక్టివిటీని తొలగించండి:
- చివరి గంట
- చివరి రోజు
- ఆల్-టైమ్
- అనుకూల పరిధి
- ఫ్రీక్వెన్సీ ఆధారంగా యాక్టివిటీని తొలగించండి:
- తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- తొలగింపు తర్వాత మార్పులను చెక్ చేయడానికి:
- మీ Google ఖాతా నుండి సైన్ అవుట్ చేయండి.
- మీ Google ఖాతాకు మళ్లీ సైన్ ఇన్ చేయండి.
- Google Pay యాప్
లో, మీ లావాదేవీ హిస్టరీని చెక్ చేయండి.
చిట్కా: Google Payలో మీ లావాదేవీ హిస్టరీని తొలగించడానికి గరిష్ఠంగా 12 గంటల సమయం పట్టవచ్చు.