మీరు కింది వాటి ద్వారా Google Payలో డబ్బు అందుకోవచ్చు:
- UPI ID
- మీ UPI IDకి లింక్ చేసిన UPI నంబర్
- QR కోడ్
- బ్యాంక్ ఖాతా వివరాలు
Google Payలో డబ్బు అందుకోండి
మీ UPI ID లేదా UPI నంబర్ ద్వారా- మీ మొబైల్ పరికరంలో, Google Pay
ని తెరవండి.
- ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
- “పేమెంట్ ఆప్షన్‌లను సెటప్ చేయండి” విభాగంలో, మీరు డబ్బును అందుకోవాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.
- మీ వివరాలను చూడటానికి, UPI IDలను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- పంపే వారితో మీ UPI IDని షేర్ చేయండి.
మీరు Google Payలో మీ వ్యక్తిగత QR కోడ్ ద్వారా డబ్బును అందుకోవచ్చు.
- మీ మొబైల్ పరికరంలో, Google Pay
ని తెరవండి.
- ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
- మీ వ్యక్తిగత QR కోడ్‌ను కనుగొనడానికి మీ ప్రొఫైల్ ఫోటో చిహ్నాన్ని మళ్లీ ట్యాప్ చేయండి.
- మీ పంపే వారికి QR కోడ్‌ను చూపండి. మీకు డబ్బు పంపడానికి ఏదైనా UPI యాప్ ద్వారా QR కోడ్‌ను స్కాన్ చేయమని మీరు పంపే వారిని అడగవచ్చు.
Google Payలో, మీ పేరు, ఫోన్ నంబర్, ఖాతా నంబర్ లేదా UPI ID కోసం సెర్చ్ చేయమని వ్యక్తిని అడగండి. అవతలి వ్యక్తి డబ్బు పంపినప్పుడు, మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మీరు USలోని ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్‌ల నుండి డబ్బును అందుకోవచ్చు.
USలోని Google Pay యూజర్‌ల నుండి డబ్బును అందుకోవడానికి అర్హత పొందడానికి, మీకు ఇవి అవసరం:
- మీ పరికరంలో Google Pay
- ఇండియన్ ఫోన్ నంబర్
USలో మీకు డబ్బులు పంపే వారికి అవసరమైన సమాచారం
- మీ పూర్తి పేరు
- మీ IFSC కోడ్
- మీరు ప్రాధాన్య బ్యాంక్ నుండి మీ ఖాతా నంబర్
లావాదేవీ వివరాలు
మీ లావాదేవీ వివరాలను చూడటానికి:
- మీ మొబైల్ పరికరంలో, Google Pay
ని తెరవండి.
- "లావాదేవీ హిస్టరీని చూడండి" అనే విభాగంలో, మీకు మరింత సమాచారం కావాల్సిన లావాదేవీని ఎంచుకోండి.
చిట్కా: మీకు బదిలీ సంబంధించిన నిర్ధారణ కావాలంటే, Google Pay యాప్‌లోని లావాదేవీ వివరాల నుండి స్క్రీన్‌షాట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోదగిన రసీదు కోసం పంపిన వారిని అడగండి.
డబ్బును రిక్వెస్ట్ చేయండి
- మీ మొబైల్ పరికరంలో, Google Pay
ని తెరవండి.
- మీరు డబ్బును రిక్వెస్ట్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్‌ను కనుగొనడానికి, సెర్చ్ బార్‌ను ఉపయోగించండి.
- దిగువున, రిక్వెస్ట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- నగదు మొత్తాన్ని, అలాగే వివరణను ఎంటర్ చేయండి.
- రిక్వెస్ట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
అవతలి వ్యక్తి మీకు పేమెంట్ చేసినప్పుడు లేదా మీ రిక్వెస్ట్‌ను తిరస్కరించినప్పుడు, మీరు Google Pay నుండి నోటిఫికేషన్ అందుకుంటారు.