మీరు కొత్త Google Pay యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, మిమ్మల్ని కనుగొనడానికి సెర్చ్‌ను ఉపయోగించేందుకు వ్యక్తులను అనుమతించే ఆప్షన్ మీకు లభిస్తుంది. ఇది మీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్‌ను కలిగి ఉన్న వ్యక్తులు Google సర్వీస్‌లు అన్నిటా మీ పేరును, అలాగే ఫోటోను కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే, ఇది మీకు డబ్బు పంపడానికి Google Payని ఉపయోగించడానికి వారిని అనుమతిస్తుంది. ఈ సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నట్లయితే, మీరు డబ్బును అందుకోవడానికి అదనపు దశలను ఫాలో అవ్వాలి.
"మిమ్మల్ని కనుగొనడానికి వ్యక్తులను అనుమతించండి" ఆప్షన్‌ను ఆన్ చేయండి
ఈ సెట్టింగ్ ఆన్‌లో లేకపోతే, మీరు ఇప్పటికే Google Payలో ఎవరైనా వ్యక్తితో కనెక్ట్ అయ్యి ఉంటే తప్ప, ఆ వ్యక్తిని సెర్చ్ చేయడం సాధ్యపడదు.
“మిమ్మల్ని కనుగొనడానికి వ్యక్తులను అనుమతించండి” అనే సెట్టింగ్‌ను ఆన్ చేయడానికి, అందుకునే వారు తప్పనిసరిగా వీటిని చేయాలి:
- Google Pay యాప్
ను తెరవండి.
- హోమ్‌స్క్రీన్
లో, ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో
ను ట్యాప్ చేయండి.
- సెట్టింగ్‌లు
గోప్యత, సెక్యూరిటీ
Google Payలో ఇతరులు మిమ్మల్ని ఎలా సెర్చ్ చేయగలరు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- మిమ్మల్ని కనుగొనడానికి వ్యక్తులను అనుమతించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీరు మీ కాంటాక్ట్‌లలో ఎవరైనా వారి పేరు, ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా సెర్చ్ చేయవచ్చు.
చిట్కాలు:
- ఎవరైనా వ్యక్తి మీ పరికరంలోని కాంటాక్ట్‌లలో ఉన్నట్లయితే, వారి పేరు ద్వారా మీరు వారిని సెర్చ్ చేయవచ్చు.
- ఎవరైనా వ్యక్తి మీ పరికరంలోని కాంటాక్ట్‌లలో లేకపోతే, వారి ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ ద్వారా మీరు వారిని సెర్చ్ చేయవచ్చు