Google Pay, అలాగే Google Wallet సమాచారాన్ని కనుగొనండి, ఎగుమతి చేయండి, లేదా తొలగించండి

మీరు మీ డేటా కాపీని ఎగుమతి చేయవచ్చు లేదా Google ఇకపై సేవ్ చేయకూడదనుకునే నిర్దిష్ట సమాచారాన్ని తొలగించవచ్చు.

ఈ ఆర్టికల్ Google Wallet యాప్‌తో, లేదా ఇతర Google Pay సర్వీస్‌లతో జరిపే మీ లావాదేవీలకు వర్తిస్తుంది.

మీ Google Pay, Google Wallet డేటాను కనుగొనండి

మీరు ఆన్‌లైన్‌లో లేదా Google Wallet యాప్‌లో మీ Google Pay డేటాను కనుగొనవచ్చు.

  • లావాదేవీ సమాచారం:
    • స్టోర్‌లలో లేదా ఆన్‌లైన్‌లో జరిపిన లావాదేవీలను కనుగొనడానికి, Google Wallet యాప్‌ను తెరవండి లేదా Google Wallet వెబ్‌సైట్ (అర్హత గల మార్కెట్‌లు మాత్రమే)కు వెళ్లండి.
    • ఇతర లావాదేవీలన్నింటినీ కనుగొనడానికి, దీనికి వెళ్లండి:
  • పేమెంట్ ఆప్షన్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు:
    • మీరు Google Wallet యాప్‌లో లేదా Google Wallet వెబ్‌సైట్ (అర్హత గల మార్కెట్‌లు మాత్రమే)లో పేమెంట్ ఆప్షన్‌లను, గిఫ్ట్ కార్డ్‌లను కనుగొనవచ్చు.
    • ఇతర సమాచారం కోసం, payments.google.com‌కు వెళ్లండి.

కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడానికి డేటాను ఉపయోగించడం ఆపివేయండి లేదా ప్రారంభించండి

Google Payతో, Google Walletతో వ్యక్తిగతీకరణను మేనేజ్ చేయండి

కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడానికి ఏ డేటా ఉపయోగించబడుతుందో మీరు కంట్రోల్ చేయవచ్చు.

Google Pay, Google Walletతో వ్యక్తిగతీకరణను మేనేజ్ చేయండి.

చిట్కాలు:

లొకేషన్ హిస్టరీని ఉపయోగించడం ఆపివేయండి లేదా ప్రారంభించండి

మీ మొబైల్ పరికరం బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ గురించిన సమాచారం, మీరు Google Wallet యాప్‌ను ఎప్పుడు ఉపయోగించగలరు అనేది మీకు తెలియజేయడానికి ఈ యాప్‌లను అనుమతిస్తుంది. మీరు సేవ్ చేసిన పేమెంట్, లాయల్టీ కార్డ్‌లను ఎక్కడ ఉపయోగించగలరు వంటి సహాయక సమాచారాన్ని ఈ ఫీచర్ అందిస్తుంది. Google Pay లేదా Google Wallet మీ లొకేషన్ హిస్టరీని ఎప్పుడు సేకరించవచ్చు అనేది మీరు ఏ సమయంలోనైనా కంట్రోల్ చేయవచ్చు.

  1. myaccount.google.com‌కు వెళ్లండి.
    • మీ Google ఖాతాకు మీరు ఇంకా సైన్ ఇన్ చేయకుంటే, సైన్ ఇన్ చేయండి.
  2. సెర్చ్ బాక్స్‌లో, యాక్టీవిటీ కంట్రోల్స్ అని టైప్ చేసి, దాన్ని ట్యాప్ చేయండి.
  3. లొకేషన్ హిస్టరీని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

మీ Google ఖాతా నుండి మీ యాక్టివిటీ లేదా డేటాను తొలగించండి

నిర్దిష్ట పేమెంట్ ఆప్షన్‌కు సంబంధించిన లావాదేవీ యాక్టివిటీని తొలగించండి

ముఖ్య గమనిక: myactivity.google.com నుండి మీరు తొలగించే డేటా, Google Pay లేదా Google Wallet వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించబడదు. బిజినెస్ లేదా చట్టపరమైన అవసరాల కోసం లేదా అవసరమైన Google Pay సర్వీస్‌లను అందించడం కోసం కొంత డేటా ఇప్పటికీ మీ Google ఖాతాలో స్టోర్ చేయబడవచ్చు.

To delete transaction activity related to a specific payment method, delete the payment method from the Google Wallet website.

మీరు myactivity.google.com నుండి కూడా సంబంధిత సమాచారాన్ని తొలగించాల్సి రావచ్చు. మీ యాక్టివిటీని ఎలా తొలగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

నిర్దిష్ట Google Pay యాక్టివిటీని తొలగించండి

ముఖ్య గమనిక: ఈ దశలు మీ Google ఖాతా నుండి సమాచారాన్ని తొలగిస్తాయి. ట్యాప్ యాక్టివిటీని తొలగిస్తే, మీ పరికరం నుండి స్టోర్‌లో చేసిన ట్యాప్‌లు కూడా తొలగించబడతాయి. మీ పరికరం నుండి ఇతర డేటాను తొలగించడానికి, తర్వాతి విభాగానికి వెళ్లండి.

స్టోర్‌లలో, యాప్‌లలో, వెబ్‌లో పేమెంట్‌లను, ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి పంపిన లేదా అందుకున్న డబ్బుకు సంబంధించిన రిక్వెస్ట్‌లను, పాత Google Pay లేదా Google Wallet యాక్టివిటీ నుండి స్పర్శరహిత పేమెంట్ ప్రయత్నాల వంటి నిర్దిష్ట ఈవెంట్‌లను తొలగించడానికి:

  1. myactivity.google.com‌కు వెళ్లండి.
    • మీరు మీ Google ఖాతాకు ఇంకా సైన్ ఇన్ చేయకుంటే, సైన్ ఇన్ చేయండి.
  2. ఆ యాక్టివిటీ జరిగిన తేదీని కనుగొనండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న యాక్టివిటీ కింద, వివరాలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఈ పేజీలో, ఇకపై అవసరం లేదు అని మీరు భావించే యాక్టివిటీని తొలగించవచ్చు.
    • కొన్ని ఐటెమ్‌లను తొలగించడానికి: ఐటెమ్ పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత తొలగించండిని ఎంచుకోండి.
    • నిర్దిష్ట తేదీలో అన్ని ఐటెమ్‌లను తొలగించడానికి: తేదీ పక్కన, తొలగించండి Deleteని ట్యాప్ చేయండి.
    • అన్ని ఐటెమ్‌లను తొలగించడానికి: మొత్తం యాక్టివిటీని ఎలా తొలగించాలో తెలుసుకోండి.

చిట్కా: మీరు నిర్దిష్ట సమాచారాన్ని మీ ప్రొఫైల్‌లో కనిపించకుండా తొలగించగలిగినా, నియంత్రణ ప్రయోజనాల కోసం Google కొంత సమాచారాన్ని స్టోర్ చేసి ఉంచుతుంది.

మొత్తం యాక్టివిటీని తొలగించండి

ముఖ్య గమనిక: మీరు నిర్దిష్ట Google Pay యాక్టివిటీని తొలగిస్తే, అది మీ Google Pay డేటా మొత్తాన్ని తొలగించదు లేదా కొత్త డేటాను సేకరించకుండా ఆపదు. Google Pay డేటా మొత్తాన్ని తొలగించడానికి, మీరు తప్పనిసరిగా మీ Google Pay సర్వీస్‌ను శాశ్వతంగా తొలగించాలి.

  1. మీ Google Account సర్వీస్ తొలగింపు పేజీకి వెళ్లండి.
  2. మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. "Google Pay" పక్కన, తొలగించండి Delete ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. బాక్స్‌లను ఎంచుకోండి.
  5. Google Payని తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ పరికరం నుండి Google Wallet డేటాను తొలగించండి

చిట్కా: మీ పరికరం పాత Android వెర్షన్‌ను కలిగి ఉంటే, ఈ దశలు భిన్నంగా ఉండవచ్చు. మీ Android వెర్షన్‌ను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

1వ దశ: Google Wallet నుండి పేమెంట్ ఆప్షన్‌లను తీసివేయండి
  1. Google Wallet యాప్ ను తెరవండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్‌ను కనుగొనండి. ఇది మొదటి కార్డ్ కాకపోతే, మీరు దాన్ని కనుగొనే వరకు స్వైప్ చేయండి.
  3. కార్డ్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎగువ కుడి వైపున, మరిన్ని More ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌ను తీసివేయండిని ట్యాప్ చేయండి.
2వ దశ: మీ కాష్‌ను ఖాళీ చేయండి
  1. సెట్టింగ్‌లు యాప్‌ను తెరవండి.
  2. యాప్‌లు ఆ తర్వాత Google Walletను ట్యాప్ చేయండి.
    • మీకు “Google Wallet” కనిపించకపోతే, అన్ని యాప్‌లను చూడండి ఆ తర్వాత Google Wallet ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. స్టోరేజ్ & కాష్ ఆ తర్వాత స్టోరేజ్‌ను క్లియర్ చేయండి ఆ తర్వాత కాష్‌ను క్లియర్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

Google Pay, Google Wallet నుండి పేమెంట్ ఆప్షన్‌లను, విలువైన డిజిటల్ ఐటెమ్‌లను తొలగించండి

Google Wallet వెబ్‌సైట్ (అర్హత గల మార్కెట్‌లు మాత్రమే) నుండి కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాల వంటి పేమెంట్ ఆప్షన్‌లను తొలగించడం ఎలాగో తెలుసుకోండి. ఇతర సమాచారం కోసం, payments.google.com‌కు వెళ్లండి.

Google Walletలో ఐటెమ్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీ Google Pay డేటాను ఎగుమతి చేయండి

మీ వ్యక్తిగత రికార్డ్‌ల కోసం మీ Google Pay డేటా కాపీని మీరు ఎగుమతి చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, takeout.google.com‌కు వెళ్లండి.
    • మీరు మీ Google ఖాతాకు ఇంకా సైన్ ఇన్ చేయకుంటే, సైన్ ఇన్ చేయండి.
  2. Google Pay ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి. ఏవైనా Google యాప్‌లు లేదా సర్వీస్‌ల నుండి మీరు డేటాను ఎగుమతి చేయకూడదని అనుకుంటే, వాటిని ఆఫ్ చేయవచ్చు.
    • మీరు ఎగుమతి చేయాలనుకుంటున్న డేటా రకాన్ని మార్చడానికి, మొత్తం యాక్టివిటీ, అలాగే సేవ్ చేయబడిన ఐటెమ్‌లు చేర్చబడ్డాయిని క్లిక్ చేయండి.
  3. తర్వాతి దశ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ ఫైల్ రకం, ఫ్రీక్వెన్సీ, అలాగే గమ్యస్థానాన్ని ఎంచుకోండి.
  5. ఎగుమతిని క్రియేట్ చేయండిని క్లిక్ చేయండి.

మీ డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మీ పేమెంట్స్ ప్రొఫైల్‌ను శాశ్వతంగా మూసివేయండి

మీ Google పేమెంట్స్ ప్రొఫైల్‌ను మీరు శాశ్వతంగా ఎలా మూసివేయగలరో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17237419401161328240
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5150109
false
false
false
false