మీరు ఐరోపా ఆర్థిక మండలిలో నివసిస్తుంటే, Google ద్వారా మీరు చేసే ప్రతి కొనుగోలుపై మీకు వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) విధించబడుతుంది. మీరు ఐరోపా ఆర్థిక మండలి లేదా మొరాకోలో నివసిస్తుంటే, Google Play ద్వారా మీరు చేసే ప్రతి కొనుగోలుపై మీకు వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) విధించబడుతుంది. ఈ కొనుగోళ్ల కోసం, మీరు VAT ఇన్‌వాయిస్ లేదా రసీదు రిక్వెస్ట్ చేయవచ్చు.
VAT ఇన్‌వాయిస్ లేదా రసీదును రిక్వెస్ట్ చేయండి
మీ VAT ఇన్‌వాయిస్ లేదా రసీదులో కనిపించే అడ్రస్ ఏదైతే ఉందో, కొనుగోలు జరిగిన సమయంలో మీ చట్టపరమైన అడ్రస్ అదే అవుతుంది. కొనుగోలు జరిగిన తర్వాత VAT ఇన్‌వాయిస్ లేదా రసీదు మీద కనిపించే అడ్రస్‌ను మీరు మార్చలేరు.
- సెట్టింగ్‌లకు సైన్ ఇన్ చేయండి.
- మీ పన్ను ID సంఖ్యను ఎంటర్ చేశారో లేదో చెక్ చేయండి. మీరు చేసి ఉండకపోతే ఇప్పుడే ఎంటర్ చేయండి.
- కొన్ని దేశాల్లో, కొనుగోలు జరపడానికి ముందు మీరు మీ పన్ను ID నంబర్‌ను ఎంటర్ చేయకపోతే, మీకు VAT ఇన్‌వాయిస్ లేదా రసీదు లభించదు.
- యాక్టివిటీ ఆప్షన్‌ను నొక్కండి.
- మీరు ఇన్‌వాయిస్ పొందాలనుకుంటున్న లావాదేవీ మీద క్లిక్ చేయండి.
- లావాదేవీ వివరాలకు దిగువున ఉన్న, VAT ఇన్‌వాయిస్‌ను డౌన్‌లోడ్ చేయండి లేదా VAT రసీదును డౌన్‌లోడ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ పూర్తి అడ్రస్ లేదా పన్ను ID లాంటి సమాచారాన్ని ఎంటర్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు.
- సేవ్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ ఇన్‌వాయిస్‌ను డౌన్‌లోడ్ చేసుకోగల లింక్ మీకు కనిపిస్తుంది.
ఇతర దేశాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌ను రిక్వెస్ట్ చేయడం
ఐరోపా ఆర్థిక మండలి లేదా మొరాకోలో నివసించే వారికి మాత్రమే, ఇన్‌వాయిస్‌లు అందుబాటులో ఉంటాయి.