మీ గుర్తింపు, లావాదేవీలకు సంబంధించిన పేమెంట్ సమాచారం, Google ప్రోడక్ట్‌లకు, సర్వీస్‌లకు చేసిన సైన్-అప్‌లు, లేదా పేమెంట్ ఆప్షన్‌లో మార్పులను వెరిఫై చేయడానికి, కింది దశలను చూడండి.
వెరిఫికేషన్ గురించిన వివరాలు
వెరిఫై చేయమని మేము మిమ్మల్ని ఎందుకు అడగాల్సి రావచ్చు- మీరు నిర్దిష్ట కంటెంట్‌ను యాక్సెస్ చేసినప్పుడు మీ సమాచారం సరైనదని నిర్ధారించడానికి.
- మీరు Googleతో లావాదేవీని పూర్తి చేసినప్పుడు మీ గుర్తింపును వెరిఫై చేయడానికి.
- మేము అసాధారణ యాక్టివిటీని లేదా లావాదేవీలను కనుగొన్నప్పుడు.
- చట్టపరమైన లేదా నియంత్రణ అవసరాల దృష్ట్యా, మాకు మరింత సమాచారం అవసరమైనప్పుడు.
ముఖ్య గమనిక: మీ ఖాతాను వెరిఫై చేయమని మేము మిమ్మల్ని అడిగితే, పెండింగ్‌లో ఉన్న లావాదేవీలు రద్దు చేయబడతాయి. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో పెండింగ్‌లో ఉన్న ఛార్జీలు 14 పని దినాలలో కనిపించడం మానేస్తాయి.
మీరు ఇవి అందించాలి:
- చట్టపరమైన పేరు
- మీ పేమెంట్స్ ప్రొఫైల్‌లో ఉపయోగించిన పేరు
- అడ్రస్
- పుట్టిన తేదీ
- మీ ప్రభుత్వ IDకి చెందిన ఇమేజ్
- అడ్రస్ రుజువు
- మీ పేమెంట్ ఆప్షన్ యొక్క ఇమేజ్
మీరు అందించే సమాచారాన్ని Google వీటి కోసం ఉపయోగిస్తుంది:
- మీ గుర్తింపును లేదా పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయడానికి.
- మోసం, అలాగే దుర్వినియోగం నుండి రక్షించడానికి.
- Google ప్రోడక్ట్‌ల కోసం వెరిఫికేషన్ సర్వీస్‌లను మెరుగుపరచడానికి.
మీ పేరు, అడ్రస్ వంటి వెరిఫై చేయబడిన మీ సమాచారాన్ని మీ Google ఖాతాతో పాటుగా స్టోర్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని pay.google.com లింక్ ద్వారా మేనేజ్ చేయవచ్చు.
వర్తించినప్పుడు, మీరు సమర్పించే సమాచారాన్ని Google గోప్యతా పాలసీకి, Google Payments గోప్యతా ప్రకటనకు అనుగుణంగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది.
మీ సమాచారాన్ని వెరిఫై చేయండి
- payments.google.comకు వెళ్లండి.
- మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- ఎగువ కుడి వైపున, అలర్ట్‌లు
వెరిఫై చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- అలర్ట్‌లు ఏవీ లేకపోతే, పేమెంట్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
- అలర్ట్‌లు ఏవీ లేకపోతే, పేమెంట్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
- తప్పనిసరిగా వెరిఫై చేయాల్సిన కార్డ్ పక్కన, వెరిఫై చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీ వెరిఫికేషన్ పద్ధతి కోసం, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
- తప్పనిసరిగా వెరిఫై చేయాల్సిన ప్రతి ఒక్క పేమెంట్ ఆప్షన్‌కు పైన పేర్కొన్న దశలను రిపీట్ చేయండి.
వెరిఫికేషన్ పద్ధతులు
వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి, ఈ కింది పద్ధతులలో ఒక దాన్ని ఉపయోగించాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
వెరిఫికేషన్ కోడ్‌ను రిక్వెస్ట్ చేయండి- కోడ్‌ను పొందండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీ పేమెంట్ ఆప్షన్ జారీ చేసిన వెబ్‌సైట్‌కు వెళ్లి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- మీ లావాదేవీ హిస్టరీలో, మీకు "GOOGLE" అనే పేరుతో $1.95 USD కంటే తక్కువ తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీ కనిపిస్తుంది. చివరి 6 అంకెలు వెరిఫికేషన్ కోడ్ అవుతుంది.
- తాత్కాలిక ఛార్జీ మొత్తం కరెన్సీ రకాన్ని బట్టి మారుతుంది.
- కోడ్ మీకు తక్షణమే అందాలి, అయితే కొన్నిసార్లు దీనికి గరిష్ఠంగా 7 రోజులు పట్టవచ్చు.
- 6 అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి.
- వెరిఫై చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: మీ ఖాతాకు విధించే ఛార్జీ లేదా ప్రామాణీకరణ ఛార్జీ అనేది తాత్కాలికం. విధించబడిన ఛార్జీలు 30 రోజుల్లో రీఫండ్ అవుతాయి.
ముఖ్య గమనిక: ఈ ప్రాసెస్ కోసం మీరు అప్‌లోడ్ చేసిన సమాచారం, గుర్తింపు ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది, స్థానిక నియంత్రణ సంస్థ అవసరాలకు అనుగుణంగా హ్యాండిల్ చేయబడుతుంది. YouTube, Google స్టోర్ కొనుగోలు వెరిఫికేషన్‌కు ఈ పద్ధతి అందుబాటులో లేదని దయచేసి గమనించండి.
మీ గుర్తింపును లేదా పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయడానికి, వెరిఫికేషన్ రిక్వెస్ట్‌ను కనుగొనండి. ఆమోదించిన డాక్యుమెంట్‌లను, సూచనల లిస్ట్‌ను కనుగొనడానికి, వెరిఫికేషన్ రిక్వెస్ట్‌లోని లింక్‌ను ఉపయోగించండి.
మీ డాక్యుమెంట్‌లు ఇలా ఉన్నాయని నిర్ధారించుకోండి:
- మీరు సమర్పించే అన్ని డాక్యుమెంట్‌లలో అదే పూర్తి పేరు ఉండాలి
- అప్‌డేట్ అయ్యి ఉండాలి, గడువు ముగిసినవి ఉండకూడదు
- స్పష్టంగా ఉండాలి
మీరు అప్‌లోడ్ చేసే ఇమేజ్ ఇలా ఉందని నిర్ధారించుకోండి:
- అది డాక్యుమెంట్ తాలూకు ఇమేజ్ తప్ప మరేదీ కాకూడదు
- అది స్పష్టంగా ఉండాలి
- అది నలుపు-తెలుపులలో కాకుండా, రంగులతో ఉండాలి
- బ్లర్‌గా, కాంతి తక్కువగా, లేదా మసకబారినట్లుగా ఉండకూడదు
- పూర్తి డాక్యుమెంట్ తాలూకు మొత్తం 4 మూలలను చూపాలి
డాక్యుమెంట్‌లలోని సమాచారాన్ని దాచిపెట్టడానికి:
- గోప్యమైన సమాచారాన్ని కవర్ చేయడానికి ముదురు రంగు బాక్స్‌ను గీయండి.
- బ్యాంక్ స్టేట్‌మెంట్‌లలో, వీటిని దాచిపెట్టండి:
- కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపించేలా పూర్తి ఖాతా నంబర్‌లను దాచిపెట్టండి.
- ఏవైనా ఖాతా బ్యాలెన్స్‌లు లేదా లావాదేవీలు. వెరిఫికేషన్ ప్రాసెస్‌కు అవసరం లేని ఖాతా బ్యాలెన్స్‌లు, లావాదేవీలు.
చిట్కాలు:
- payments.google.comలో మీ పేరు, అడ్రస్, పేమెంట్ సమాచారం అప్‌డేట్ అయ్యి ఉన్నాయని నిర్ధారించుకోండి.
- మీ డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత, వెరిఫికేషన్‌కు కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.
వెరిఫికేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి
వెరిఫికేషన్ కోడ్‌లకు, తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండిమీ పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయమని మిమ్మల్ని అడిగితే, మీ కార్డ్ లావాదేవీ హిస్టరీ లేదా స్టేట్‌మెంట్‌లో కనిపించే తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీతో లేదా విధించబడిన ఛార్జీతో పూర్తి చేయగలరు. మీకు వెరిఫికేషన్ కోడ్‌లతో సమస్యలు ఉంటే, కింది గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వండి.
ముఖ్య గమనిక: మీ లావాదేవీలలో కోడ్ వెంటనే కనిపించకపోవచ్చు. మీరు పరిష్కార ప్రక్రియను ప్రారంభించడానికి ముందు రెండు రోజులు వేచి ఉండండి.
సమస్యను వెంటనే పరిష్కరించడానికి, మీరు కింద పేర్కొన్న విధంగా చేయవచ్చు:
- ఆప్షన్ అందుబాటులో ఉంటే, వెరిఫై చేయడానికి డాక్యుమెంట్‌లను సమర్పించండి.
- YouTube, Google Store కొనుగోలు వెరిఫికేషన్‌కు, డాక్యుమెంట్ అప్‌లోడ్ పద్ధతి అందుబాటులో లేదు.
- వేరే పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించండి.
మరింత సమాచారం కోసం, పేమెంట్ ఆప్షన్ వెరిఫికేషన్ కోడ్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి.
- మీరు ఈమెయిల్ అందుకున్నా లేదా ఎర్రర్ మెసేజ్ పొందినా, మెసేజ్‌లోని సూచనలను ఫాలో అవ్వండి.
- మీరు డాక్యుమెంట్‌లను సమర్పించినప్పుడు ఏవైనా సమస్యలు ఎదురైతే, సపోర్ట్‌ను సంప్రదించండి.
- సమస్యను పరిష్కరించడానికి మీకు మా టీమ్ నుండి సహాయం అవసరమైతే, మీ సమాచారాన్ని రివ్యూ చేసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తాము.
మీ వెరిఫికేషన్ విఫలమైతే, మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఈమెయిల్ అందుతుంది. నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి, ఈమెయిల్‌లోని సూచనలను ఫాలో అవ్వండి.
సంబంధిత రిసోర్స్‌లు
మరింత సహాయం కావాలా?
మీకు ఇప్పటికీ సమస్యలు ఉన్నా లేదా ఏవైనా సందేహాలు ఉన్నా, మీరు కమ్యూనిటీని అడగవచ్చు లేదా మమ్మల్ని సంప్రదించవచ్చు.