Important:
- Starting July 22, 2024, you’ll no longer be able to pay with your linked PayPal when you check out online using the Google Pay button.
- You can continue to use linked credit or debit cards, including PayPal branded cards.
- To continue to pay online securely and seamlessly with the Google Pay button, make sure you have at least 1 card added to your Google account. Learn how to manage payment methods on the Google Wallet website.
- If you have non-Google recurring payments or subscriptions set up with your linked PayPal account, update your payment method at those businesses as soon as possible to avoid any issues.
మీరు ఆన్‌లైన్‌లో లేదా Uber, Airbnb వంటి యాప్‌లలో షాపింగ్ చేసినప్పుడు, Google Payలో స్టోర్ చేసిన మీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి వేగంగా పేమెంట్ చేయవచ్చు. Google Payతో మీ పేమెంట్ సమాచారాన్ని మీరు ప్రతిసారి ఎంటర్ చేయవలసిన అవసరం లేదు.
మీరు Google Payని ఎప్పుడు ఉపయోగించవచ్చు
మీరు Google Payలో సేవ్ చేసి ఉన్న పేమెంట్ ఆప్షన్‌తో పేమెంట్ చేయవచ్చు:
- యాప్ లేదా వెబ్‌సైట్ Google Payని పేమెంట్ ఆప్షన్‌గా అందిస్తే
- మీకు ఈ బటన్‌లు చెక్ అవుట్ వద్ద కనిపించినప్పుడు
Google Payతో చెక్ అవుట్ చేయండి
- చెక్ అవుట్ వద్ద, Google Pay బటన్‌ను ట్యాప్ చేయండి.
- అడిగితే, పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి మరియు మీ షిప్పింగ్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
- మీ ఆర్డర్‌ను నిర్ధారించండి.
Google Payలో పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి లేదా మార్చండి
యాప్ లేదా వెబ్‌సైట్ పేమెంట్‌ల గురించి సాధారణ ప్రశ్నలు
నేను ఆర్డర్ చేసిన వస్తువులు లేదా సర్వీస్‌లు నాకు అందలేదు
మీ ఆర్డర్ గురించి మీకు ఏదైనా సందేహం ఉంటే, నేరుగా వ్యాపారిని సంప్రదించండి.
నేను ఆర్డర్ కోసం రీఫండ్‌ను పొందాలనుకుంటున్నాను
రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, నేరుగా వ్యాపారిని సంప్రదించండి.
నా బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ యాప్‌లో GOOGLE *TEMPORARY HOLD అని ఎందుకు కనిపిస్తోంది. ఇది ఏమిటి?
Google సర్వీస్ ద్వారా పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించినప్పుడు, మీరు GOOGLE *TEMPORARY HOLD డిస్క్రిప్టర్‌తో మీ ఖాతాలో ఛార్జీని కనుగొనవచ్చు. ఇది మీ కార్డ్ ఖాతా చెల్లుబాటు అయ్యేదని వెరిఫై చేయడానికి అమలు చేసే పెండింగ్ ఛార్జీ. లావాదేవీ పూర్తి అయ్యాక ఈ హోల్డ్ తొలగిపోతుంది.
నా పేమెంట్ జరగలేదు. నేను ఏం చేయాలి?
- వ్యాపారి మీ పేమెంట్ ఆప్షన్‌ను అంగీకరిస్తారో లేదో చెక్ చేయండి.
- మీ ఖాతాలో ఎలాంటి సమస్యలూ లేవని నిర్ధారించుకోండి. ఏవైనా అలర్ట్‌ల కోసం payments.google.com
ను చెక్ చేయండి.
- బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ వద్ద ఉన్న మీ సమాచారం, మీ పేమెంట్స్ ప్రొఫైల్ సెట్టింగ్‌లలోని పేరు, అడ్రస్‌లతో మ్యాచ్ అవుతోందని నిర్ధారించుకోండి.
- మీ బిల్లింగ్ సమాచారం మ్యాచ్ అయితే, మరొక పేమెంట్ ఆప్షన్‌తో లావాదేవీని మళ్లీ ట్రై చేయండి. మీ Google పేమెంట్ సమాచారాన్ని మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
- మీకు ఒక పేమెంట్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లయితే, మీ Google ఖాతా నుండి పేమెంట్ ఆప్షన్‌ను తీసివేసి, దాన్ని మళ్లీ జోడించడానికి ట్రై చేయండి. ఆపై, లావాదేవీని మళ్లీ ట్రై చేయండి. పేమెంట్ ఆప్షన్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.
- పైన పేర్కొన్న వాటిలో ఏదీ పని చేయకపోతే, లావాదేవీ ఎందుకు తిరస్కరించబడిందో తెలుసుకోవడానికి, మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీని సంప్రదించండి.
ఫీడ్‌బ్యాక్‌ను పంపండి
యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో పేమెంట్ ఆప్షన్‌గా Google Payని ఉపయోగించిన మీ అనుభవం గురించి మాకు చెప్పడానికి:
- wallet.google.comకు వెళ్లండి.
- ఎడమ వైపున, ఫీడ్‌బ్యాక్
పంపండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీకు నచ్చినవి లేదా నచ్చనివి లేదా మీరు కనుగొన్న బగ్‌ల గురించి మాకు చెప్పండి.
Google Payను మీ యాప్ లేదా వెబ్‌సైట్‌కు జోడించండి
మీరు మీ యాప్‌లో, అలాగే మీ వెబ్‌సైట్‌లో యూజర్‌ల కోసం సులభమైన చెక్ అవుట్‌ను అనుమతించాలనుకుంటే, మరింత సమాచారం కోసం developers.google.com/pay/ లింక్‌కు వెళ్లండి.