కొనుగోలు చేయడం లేదా డబ్బు పంపడం లేదా స్వీకరించడం అనేది మోసపూరితంగా జరిగిందని మీరు భావించినట్లయితే, ఆ లావాదేవీని వివాదాస్పదమైనదిగా మీరు ఫిర్యాదు చేయవచ్చు. మీరు Google Payను ఉపయోగించి చేసిన కొన్ని పేమెంట్‌లను రద్దు చేయవచ్చు.
దశ 1: లావాదేవీ పూర్తి అయ్యిందా లేదా అని చెక్ చేయండి
- అది పూర్తయ్యే వరకు లావాదేవీ వివాదాస్పదం చేయబడదు.
- ఇప్పటికీ ప్రాసెస్ విధానంలో ఉన్న లావాదేవీల కోసం చూపబడిన మొత్తం తాత్కాలికమైనది, అది మారవచ్చు.
- మీరు ఆర్డర్ లేదా పేమెంట్‌ను రద్దు చేసిన తర్వాత, మీ ఖాతా క్రెడిట్ కావడానికి కొంత సమయం పట్టవచ్చు.
దశ 2: లావాదేవీ మీకు తెలిసిన వారి ద్వారా జరిగిందా అని చెక్ చేయండి
ఫ్యామిలీ మెంబర్ లేదా స్నేహితుడు మీ Google ఖాతా లేదా పేమెంట్ ఆప్షన్‌కు యాక్సెస్‌ని కలిగి ఉండి, లావాదేవీని చేస్తే, దిగువున ఉన్న సంబంధిత విభాగానికి వెళ్లండి.
Google కొనుగోలును రద్దు చేయండి
ముఖ్య గమనిక: ఈ సమాచారం వ్యక్తులకు మాత్రమే, బిజినెస్‌లకు కాదు. బిజినెస్‌లకు సంబంధించిన Google Pay గురించి మరింత సమాచారం కోసం, పేమెంట్‌ల కేంద్రం తాలూకు సహాయ కేంద్రానికి వెళ్లండి.
Google సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి
ముఖ్యమైనది: మీరు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసినప్పుడు, పూర్తయిన పేమెంట్‌లు రీఫండ్ చేయబడవు. సబ్‌స్క్రిప్షన్ రద్దులను చర్య రద్దు చేయడం సాధ్యపడదు, అయితే మీరు ఎప్పుడైనా తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.
మీరు అధికారం మంజూరు చేయని పేమెంట్ గురించి వివాదం లేదా రిపోర్ట్ చేయండి
Google ప్రోడక్ట్‌ల కోసం ఒక పేమెంట్‌ను వివాదం చేయండి
Google Pay యాప్‌లో మీరు గుర్తించని లావాదేవీ గురించి వివాదాన్ని ఫైల్ చేయండి
మీకు Google Pay వెబ్‌సైట్‌లో గుర్తించని లావాదేవీ ఏదైనా కనిపించినట్లయితే:
- మీ ఆర్థిక సంస్థకు చెందిన ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లో లేదా యాప్‌లోని రికార్డులతో Google Pay లావాదేవీ మొత్తాన్ని పోల్చండి.
- భౌతిక బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా రసీదులపై ఆధారపడవద్దు, ఇవి పాతవి కావచ్చు.
- మీ ఆర్థిక సంస్థ పోర్టల్‌లోని మొత్తం ఖచ్చితంగా లేకుంటే లేదా మీరు ఛార్జీని గుర్తించలేకపోతే, వ్యాపారిని సంప్రదించి, వారితో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
- మీరు వ్యాపారితో సమస్యను పరిష్కరించలేకపోతే, మీరు వివాదాన్ని ఫైల్ చేయవచ్చు.
- ఒకవేళ వీటిని ఉపయోగించి లావాదేవీ జరిపితే: మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఖాతా, లేదా మీ Google Pay ఖాతాకు లింక్ చేసిన ఇతర పేమెంట్ ఆప్షన్, మీరు వివాదాన్ని ఫైల్ చేయవచ్చు.