ముఖ్యం: మీరు Google Pay యాప్‌ని ఉపయోగించి మీ పేమెంట్స్ ప్రొఫైల్‌ను మూసివేస్తే, మీరు భవిష్యత్తులో Google Pay యాప్‌ని మళ్లీ ఉపయోగించాలనుకుంటే తప్పనిసరిగా కొత్త Google ఖాతాను క్రియేట్ చేయాలి.
మీ Google పేమెంట్స్ సర్వీస్‌ను శాశ్వతంగా ముగించడానికి, Google Pay నుండి మీ సమాచారాన్ని తొలగించడానికి, అలాగే మీ Google పేమెంట్స్ ప్రొఫైల్‌ను మూసివేయడానికి ఈ సూచనలను ఫాలో అవ్వండి. మీరు మీ పేమెంట్స్ ప్రొఫైల్‌ను మూసివేసిన తర్వాత, మీరు దాన్ని మళ్లీ తెరవలేరు లేదా గతంలో చేసిన లావాదేవీని లేదా పేమెంట్ ఆప్షన్ సమాచారాన్ని కనుగొనలేరు.
మీరు మీ పేమెంట్స్ ప్రొఫైల్‌ను మూసివేసే ముందు
- దీని వల్ల మీ Google ఖాతా ఎలా ప్రభావితం అవుతుందో మీకు తెలుసని నిర్ధారించుకోండి. మీరు మీ Google పేమెంట్స్ ప్రొఫైల్‌ని మూసివేస్తే, మీరు వీటిని చేయలేరు:
- Google Play, Google Ads, Google Fi, Google One లేదా ఇతర Google ప్రోడక్ట్‌ల నుండి కొనుగోళ్లు చేయడం.
- కొనుగోళ్లు చేయడం కోసం Google Payని ఉపయోగించడం.
- గిఫ్ట్ కార్డ్‌లు, లాయల్టీ ప్రోగ్రామ్‌లు, పేమెంట్ సమాచారాన్ని స్టోర్ చేయడం.
- మీ లావాదేవీ చరిత్రను కనుగొనడం.
- మీరు మీ Google Pay డేటాలో చాలా వరకు తొలగించాలనుకుంటే, అయినప్పటికీ భవిష్యత్తులో ఏదైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటే, మీరు వీటిని చేయవచ్చు:
మీ సర్వీస్‌ను శాశ్వతంగా ముగించండి
ముఖ్యం: మీరు పేమెంట్స్ ప్రొఫైల్‌ని తొలగించిన తర్వాత అందులోని కొంత సమాచారాన్ని చట్టసంబంధమైన, నియంత్రణా వ్యవస్థల అనివార్య కార్యాలకు అనుకూలంగా ఉండటానికి నిర్ణీత కాలం పాటు మేము నిల్వ చేసే అవకాశం ఉంటుంది.
దశ 1: మీ ఖాతా నుండి Google పేమెంట్స్ సర్వీస్‌ని తొలగించండి
ముఖ్యం: మీరు మీ సమాచారాన్ని తొలగించే ముందు, మీ డేటాను డౌన్‌లోడ్ చేయవచ్చు.
ఈ దశలో ఈ విధమైన డేటా తొలగించబడుతుంది:
- క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లు, థర్డ్-పార్టీకి లింక్ చేసిన ఖాతాలకు సంబంధించిన వర్చువల్ ఖాతా నంబర్‌లు.
- లాయల్టీ కార్డ్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు, ఆఫర్‌లు, రివార్డ్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ టిక్కెట్‌లు.
- వర్చువల్ ఖాతా నంబర్‌లతో మీ లావాదేవీలు.
- మీ ఇన్-స్టోర్ పేమెంట్ ప్రయత్నాలు.
- లాయల్టీ కార్డ్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు, ఆఫర్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్డ్‌లు, మరియు మరేదైనా “Google Payకు సేవ్ చేయి” ఐటెమ్‌ల యొక్క మీ ఇన్-స్టోర్ ఉపయోగాలు.
- Googleకు చెందని యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లలోని వస్తువులు మరియు సర్వీస్‌ల కోసం డిజిటల్ యాప్‌లో కొనుగోళ్లు కాకుండా ఉండే మీ Google Pay లావాదేవీలు.
Google Pay నుండి సమాచారాన్ని తొలగించడానికి:
- myaccount.google.comకు వెళ్ళండి.
- మీరు ఇంకా సైన్ ఇన్ చేసి ఉండకపోతే, సైన్ ఇన్ చేయాలి.
- గోప్యత & వ్యక్తిగతీకరణ ఎంచుకోండి.
- కిందికి “మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి లేదా తొలగించండి” ఎంపికకు స్క్రోల్ చేయండి.
- సర్వీస్‌ను తొలగించు
సర్వీస్‌ను తొలగించు ఎంచుకోండి.
- మీరు మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
- "Google Pay”ని కనుగొనండి.
- తొలగించు
ఎంచుకోండి.
- స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.
2వ దశ: మీ Google పేమెంట్ ప్రొఫైల్‌ను శాశ్వతంగా మూసివేయండి
ముఖ్యం: మీరు మీ Google Play బ్యాలెన్స్‌లో ఏదైనా డబ్బు కలిగి ఉంటే, మీరు వీటీలో ఏదైనా చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము:
- మీరు ప్రొఫైల్‌ని మూసివేయడానికి ముందే ఖర్చు చేయవచ్చు. ఖాతాల మధ్య Google Play బ్యాలెన్స్‌ని బదిలీ చేయలేరు.
- మీరు ప్రొఫైల్‌ని మూసివేసే ముందు దీన్ని బదిలీ చేయండి. మీ బ్యాలెన్స్ తనిఖీ చేసి, దానిని Google Pay నుండి బదిలీ చేయడానికి, మీరు మీ బ్యాలెన్స్ తనిఖీ చేయాల్సిన సూచనలను కనుగొని, Google Pay నుండి డబ్బు బదిలీ చేయండి (US మాత్రమే).
ఈ దశ ఈ విధమైన డేటాను ప్రభావితం చేస్తుంది:
- Google ప్రోడక్ట్‌లు, Googleకు చెందని యాప్‌లు, వెబ్‌సైట్‌లలో కొనుగోళ్ల కోసం సేవ్ చేసిన క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలు, ఇతర పేమెంట్ ఆప్షన్‌లు
- Google Play, Google Ads, YouTube, ఇతర Google ప్రోడక్ట్‌లలో చేసిన కొనుగోళ్లు, అలాగే ఏవైనా డిజిటల్ యాప్‌లోని కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీ సమాచారం
మీ Google పేమెంట్ ప్రొఫైల్‌ను మూసివేయడానికి:
- ఆప్షనల్: మీకు పలు ప్రొఫైల్స్ ఉంటే, payments.google.comకు వెళ్లి, మీరు మూసివేయాలనుకుంటున్న ప్రొఫైల్‌కు సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.
- payments.google.com
సెట్టింగ్‌లకు వెళ్లండి.
- “పేమెంట్స్ ప్రొఫైల్ స్టేటస్” కింద, పేమెంట్స్ ప్రొఫైల్‌ను మూసివేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.