Google ప్రోడక్ట్‌లు మరియు సర్వీసుల కోసం మీరు చేసిన ఆర్డర్‌లను మేనేజ్ చేయడం గురించిన సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు.
మీరు Google ద్వారా చేసిన ఆర్డర్‌లను, వాటి రసీదులను చూడడానికి:
- 'pay.google.com'కు సైన్ ఇన్ చేయండి.
- మీ ఆర్డర్‌ను కనుగొనండి. ఇది మీకు కనపడకపోతే, మరిన్ని లావాదేవీలను చూడండిని క్లిక్ చేయండి.
- రసీదును తెరవడానికి, ఆర్డర్‌పై క్లిక్ చేయండి.
మీ ఆర్డర్‌లో ఏదైనా మార్పు చేయడం
వీటిలో ఏదైనా చేయాలనుకుంటే మీరు Google సర్వీస్ లేదా విక్రేతను సంప్రదించండి:
- మీ ఆర్డర్ గురించి ప్రశ్నను అడగడం
- దేనినైనా వాపసు ఇవ్వడం లేదా రీఫండ్‌ను పొందడం
- ఆర్డర్‌ను రద్దు చేయడం
సంప్రదింపు సమాచారం మీ ఆర్డర్ రసీదుకు దిగువన ఉంది.
గమనిక: Google Pay లావాదేవీల లిస్ట్ నుండి ఆర్డర్‌లను తీసివేయడం లేదా తొలగించడం సాధ్యం కాదు.
ఆర్డర్‌లతో వచ్చే సమస్యలను పరిష్కరించడం
ఆర్డర్ సమస్యలలో చాలా వాటిని పరిష్కరించడం కోసం, Google సర్వీస్ లేదా విక్రేతను సంప్రదించండి. సంప్రదింపు సమాచారం మీ ఆర్డర్ రసీదుకు దిగువన ఉంది.
కొన్ని సాధారణ సమస్యలకు పరిష్కారాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- 'pay.google.com'కు సైన్ ఇన్ చేయండి.
- మీ ఆర్డర్‌ను క్లిక్ చేయండి. ఇది మీకు కనపడకపోతే, మరిన్ని లావాదేవీలను చూడండిని క్లిక్ చేయండి.
- "స్టేటస్"కు దిగువన, రీఫండ్ చేయబడింది అని ఉందో లేదో తనిఖీ చేయండి.
ఆర్డర్‌ను రద్దు చేసిన తర్వాత ఒకవేళ మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో దానికి ఛార్జి మీకు కనిపిస్తే, ప్రామాణీకరణ పెండింగ్‌లో ఉన్నదని దీని అర్థం. ఇది కొద్ది రోజుల్లోనే కనిపించడం మానేస్తుంది.
మీ ఆర్డర్ ఒకవేళ నిలిపివేయబడినా లేదా రద్దు చేయబడినా, అలా ఎందుకు జరిగిందో మీకు తెలియకపోతే:
- 'pay.google.com'కు సైన్ ఇన్ చేయండి.
- మీ ఆర్డర్‌ను క్లిక్ చేయండి. ఇది మీకు కనపడకపోతే, మరిన్ని లావాదేవీలను చూడండిని క్లిక్ చేయండి.
- ఆర్డర్‌కు పక్కన, మీకు కారణం కనిపిస్తుంది.
- తిరస్కరించబడిన కార్డ్ కారణంగా ఒకవేళ ఇది రద్దు చేయబడితే, మీ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
- ఇది రద్దు కావడానికి ఒకవేళ తిరస్కరించబడిన కార్డ్ అనేది కారణం కాకుంటే, విక్రేత యొక్క (ఉదా. Google Play) సపోర్ట్ బృందాన్ని సంప్రదించండి. మీరు సాధారణంగా ఈ సమాచారాన్ని వారి సహాయ కేంద్రంలో కనుగొనవచ్చు.