Google Payని ఉపయోగించి మీరు కొనుగోలు చేసిన దేనినైనా వాపసు చేయడం లేదా రీఫండ్ పొందడం గురించిన సమాచారాన్ని మీరు ఇక్కడ పొందవచ్చు.
అనధికార కొనుగోలును రిపోర్ట్ చేయడంలో సహాయం పొందడానికి, ఇక్కడికి వెళ్లండి.
మీరు స్టోర్‌లో కొనుగోలు చేసిన దానిని వాపసు చేయండి
- మీ స్టోర్ రసీదును కనుగొనండి.
- రసీదును, ఐటెమ్‌ను స్టోర్ వద్దకు తీసుకురండి.
- మీ కార్డ్‌ను స్వైప్ చేయమని వ్యాపారి మిమ్మల్ని అడిగితే, మీ ఫోన్ వెనుక వైపును స్పర్శరహిత పేమెంట్ టెర్మినల్ వద్ద పెట్టి ఉంచండి.
- కొన్నింటిని వాపసు చేయాలంటే, మీరు మీ వర్చువల్ ఖాతా సంఖ్య తాలూకు చివరి 4 అంకెలను అందించాల్సి ఉంటుంది. మీరు మీ వర్చువల్ ఖాతా సంఖ్యను మీ Google Pay యాప్
లోని కార్డ్ వివరాల స్క్రీన్‌లో కనుగొనవచ్చు.
- కొన్నింటిని వాపసు చేయాలంటే, మీరు మీ వర్చువల్ ఖాతా సంఖ్య తాలూకు చివరి 4 అంకెలను అందించాల్సి ఉంటుంది. మీరు మీ వర్చువల్ ఖాతా సంఖ్యను మీ Google Pay యాప్
గమనిక: మీకు మీ రీఫండ్ ఎప్పుడు అందుతుందో మీ రిటైలర్ తెలియజేస్తారు.
మీరు Google Payతో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన దానిని వాపసు చేయండి
Googleకు చెందని వెబ్‌సైట్ లేదా యాప్ నుండి ఏదైనా కొనుగోలు చేయడానికి మీరు Google Payని ఉపయోగించినట్లయితే, రిటైలర్‌కు చెందిన కస్టమర్ సపోర్ట్ విభాగం తాలూకు టీమ్‌ను సంప్రదించండి. రీఫండ్‌లు మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు జమ చేయబడతాయి, మీ Google Pay బ్యాలెన్స్‌కు కాదు.
Google ప్రోడక్ట్‌ను వాపసు చేయండి
మీరు వాపసు చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ కోసం సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.