మీ ఈమెయిల్, అడ్రస్, లేదా ఫోన్ నంబర్‌ను ఎడిట్ చేయండి లేదా తొలగించండి
- మీ iPhone లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మరిన్ని
సెట్టింగ్‌లు
ను ట్యాప్ చేయండి.
- అడ్రస్‌లు, ఇంకా మరిన్ని ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- సమాచారాన్ని ఎడిట్ చేయండి లేదా తొలగించండి:
- ఎడిట్ చేయండి:
- ఎంట్రీని ట్యాప్ చేయండి.
- ఎగువున కుడి వైపున, ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీ సమాచారాన్ని మీరు మార్చినప్పుడు, ఎగువున కుడి వైపున, పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- తొలగించండి:
- దిగువున కుడి వైపున ఉన్న, ఎడిట్ చేయండి అనే ఆప్షన్ను ట్యాప్ చేయండి.
- ఎంట్రీని ఎంచుకోండి.
- తొలగించండి
అడ్రస్‌ను తొలగించండి
పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- ఎడిట్ చేయండి:
Chromeలో మీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి, ఎడిట్ చేయండి, లేదా దాని పేరును మార్చండి
పేమెంట్ ఆప్షన్‌ను జోడించడానికి:
- మీ iPhone లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మరిన్ని
సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- మీ పేమెంట్ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
- మీ సమాచారాన్ని సేవ్ చేయడానికి, ఎగువున ఉన్న, జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
పేమెంట్ ఆప్షన్‌ను ఎడిట్ చేయడానికి లేదా దాని పేరును మార్చడానికి:
- మీ iPhone లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మరిన్ని
సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- మీరు మార్చాలనుకుంటున్న ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ పేమెంట్ ఆప్షన్ వివరాలను, మారుపేరును మార్చండి.
- 'పూర్తయింది'ని ట్యాప్ చేయండి.
- మీరు గతంలో మీ పేమెంట్ ఆప్షన్‌లను Google Payలో సేవ్ చేసి ఉంటే, అక్కడ మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి మీరు Google Pay సైట్‌కు మళ్లించబడతారు.
చిట్కాలు:
- మీరు పేమెంట్ ఆప్షన్‌కు చెందిన పేరును మార్చినట్లయితే, సేవ్ చేసిన పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించే ఫారమ్‌ను మీరు ఎంచుకున్నప్పుడు ఇది కనిపిస్తుంది.
- Chrome పేమెంట్ ఆప్షన్ మారుపేర్లు Google Payకి బదిలీ అవ్వవు. మీ పేమెంట్ సమాచారాన్ని మీరు Google Payలో సేవ్ చేస్తే, దానిని మీరు విడిగా అప్‌డేట్ చేయాలి.
ఫారమ్‌ను ఫిల్ చేయడానికి ఆటోఫిల్‌ను ఉపయోగించండి
- మీ iPhone లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మీరు కాంటాక్ట్, పేమెంట్ లేదా లాగిన్ సమాచారంతో ఆన్‌లైన్ ఫారమ్‌ను ఫిల్ చేయాల్సిన వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- ఫారమ్‌లో ఫీల్డ్‌ను ఎంచుకోండి.
- మీరు ఫారమ్‌ను ఆటోఫిల్ చేయాలనుకుంటున్న సేవ్ చేసిన సమాచారాన్ని ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు సేవ్ చేసిన సమాచారాన్ని కనుగొనడానికి లేదా ఎడిట్ చేయడానికి, మీ కీబోర్డ్‌లో, ఎగువ కుడి వైపున ఉన్న, విస్తరించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Google Payలో మీ పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేయండి
మీరు Chromeకు సైన్ ఇన్ చేసి, ఆన్‌లైన్ ఫారమ్‌లో మీ పేమెంట్ ఆప్షన్‌ను మీరు ఎంటర్ చేసినప్పుడు, ‘మీ పేమెంట్ సమాచారాన్ని మీరు Google Payలో సేవ్ చేయాలనుకుంటున్నారా’ అని Chrome అడగవచ్చు. మీరు ఆమోదించినట్లయితే, మీ పేమెంట్ సమాచారం Google Payలో సేవ్ చేయబడుతుంది. మీ పేమెంట్ ఆప్షన్‌ను Google Pay సపోర్ట్ చేయకపోతే, మీ పరికరంలోనే దాన్ని సేవ్ చేసే సదుపాయాన్ని Chrome అందించవచ్చు.
Google Payలో సేవ్ చేసిన పేమెంట్ ఆప్షన్‌లు, చాలా ఆన్‌లైన్ ఫారమ్‌లలో సూచనలుగా కనిపిస్తాయి.
Google Payలో మీ పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేసే సదుపాయాన్ని Chrome అందించకపోతే, Chromeలో సేవ్ చేసిన పేమెంట్ సమాచారంతో ఎదురైన సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.
- wallet.google.comకు వెళ్లండి.
- పేమెంట్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఎడిట్ చేయండి: పేమెంట్ ఆప్షన్‌కు దిగువున, ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
- తొలగించండి: పేమెంట్ ఆప్షన్‌కు దిగువున, తీసివేయండిని ట్యాప్ చేయండి.
మీరు ఆన్‌లైన్‌లో ఫారమ్‌లను పూరించినప్పుడు, Google Payలో సేవ్ చేసిన చాలా కార్డ్‌లు సూచనలుగా కనిపిస్తాయి. Google Payలో పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేయడాన్ని ఆపివేయడానికి:
- మీ iPhone లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మరిన్ని
సెట్టింగ్‌లు
ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- ఎగువున, మీ ఖాతా పేరును ట్యాప్ చేయండి.
- పేమెంట్ ఆప్షన్‌లు, ఆఫర్‌లు, Google Payను ఉపయోగిస్తున్న అడ్రస్‌లు ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
Chromeలో సమాచారాన్ని సేవ్ చేయడాన్ని ఆపివేయండి
- మీ iPhoneలో లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మరిన్ని
సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లు లేదా అడ్రస్‌లు, ఇంకా మరిన్ని ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేయడాన్ని ఆపివేయడానికి: పేమెంట్ ఆప్షన్‌లను సేవ్ చేసి, పూరించండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
- అడ్రస్‌లను, కాంటాక్ట్ సమాచారాన్ని సేవ్ చేయడాన్ని ఆపివేయడానికి: అడ్రస్‌లను సేవ్ చేసి, పూరించండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
"ఆటోఫిల్‌ను ఉపయోగించినప్పుడు ఎల్లప్పుడూ వెరిఫై చేయండి" సెట్టింగ్‌ను మేనేజ్ చేయండి
ముఖ్య గమనిక: ఇది పరికర-స్థాయి సెట్టింగ్. మీరు ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయాలనుకుంటున్న ప్రతి పరికరం కోసం దీన్ని తప్పనిసరిగా ఆన్ చేయాలి.
మీ పరికరాన్ని షేర్ చేస్తున్నప్పుడు ఇతరులు మీ పేమెంట్ సమాచారాన్ని ఉపయోగించకుండా నిరోధించడానికి, మీరు ఆటోఫిల్‌ను ఉపయోగించినప్పుడు వెరిఫికేషన్‌ను ఆన్ చేయవచ్చు. ఈ సెట్టింగ్‌తో, మీరు మీ సెక్యూరిటీని పెంచుకుని, మోసపూరిత యాక్టివిటీల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
- మీ iPhone లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మరిన్ని
సెట్టింగ్‌లు
ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- పేమెంట్ ఆప్షన్‌లు అనే ఆప్షన్ను ట్యాప్ చేయండి.
- "ఆటోఫిల్‌ను ఉపయోగించినప్పుడు ఎల్లప్పుడూ వెరిఫై చేయండి" సెట్టింగ్‌కు పక్కన, ఆన్ లేదా ఆఫ్ చేయండి.
ఈ సెట్టింగ్ లేత బూడిదరంగులో ఉండి, మీరు దాన్ని ఆన్ చేయలేకపోయినట్లయితే, కింది వాటిని చెక్ చేయండి:
- పరికరానికి స్క్రీన్ లాక్ ఉందని నిర్ధారించుకోండి. ఈ సెట్టింగ్‌ను ఉపయోగించడానికి స్క్రీన్ లాక్ అవసరం.
- ప్రధాన ఆటోఫిల్ ఆప్షన్ అయిన "పేమెంట్ ఆప్షన్‌లను సేవ్ చేసి, పూరించండి" ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి.
సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, సెక్యూరిటీ ప్రయోజనాల నిమిత్తం, మీ పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయమని మిమ్మల్ని అప్పుడప్పుడు అడగవచ్చు.
సేవ్ చేసిన మీ సమాచారాన్ని సూచించడంలో Chromeతో మీకు సమస్యలు ఉంటే
- ఆటోమేటిక్‌గా ఆటో-ఫిల్ అవ్వని సమాచారాన్ని మీరు సేవ్ చేశారని నిర్ధారించుకోవడానికి: మరిన్ని
సెట్టింగ్‌లు
ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- Chrome నుండి ఈ సమాచారాన్ని పొందడానికి వెబ్‌సైట్ తగినంత సురక్షితంగా ఉండకపోవచ్చు.
- వెబ్‌సైట్ సురక్షితంగా ఉన్నప్పటికీ, ఫారమ్‌లో కొన్ని ఫీల్డ్‌లను Chrome గుర్తించలేకపోవచ్చు.
సేవ్ చేసిన సమాచారంతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.
సేవ్ చేసిన మీ ఆటోఫిల్ ఫారమ్ సమాచారాన్ని Chrome నుండి తొలగించండి
మీ అడ్రస్‌లు, పేమెంట్ ఆప్షన్‌లు, లేదా ఇతర సేవ్ చేసిన సమాచారాన్ని Chrome నుండి ఒకేసారి తొలగించడానికి:
- మీ iPhoneలో లేదా iPadలో, Chrome
ను తెరవండి.
- మరిన్ని
బ్రౌజింగ్ డేటాను తొలగించు ఎంపికను ట్యాప్ చేయండి.
- "చివరి గంట" లేదా "మొత్తం సమయం" వంటి సమయ పరిధిని ఎంచుకోండి.
- "అధునాతనం" విభాగంలో, ఫారమ్ డేటాను ఆటోఫిల్ చేయండి ఎంపికను ఎంచుకోండి.
- బ్రౌజింగ్ డేటాను తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఈ ఆప్షన్ Google Payలో స్టోర్ చేసిన పేమెంట్ సమాచారాన్ని, అడ్రస్‌లను తొలగించదు. Google Payలో పేమెంట్ ఆప్షన్‌ను తీసివేయడం ఎలాగో తెలుసుకోండి.