- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని
సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- అడ్రస్‌లు, ఇంకా మరిన్ని లేదా పేమెంట్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- సమాచారాన్ని జోడించండి, ఎడిట్ చేయండి, లేదా తొలగించండి:
- జోడించండి:
- దిగువున, అడ్రస్‌ను జోడించండి లేదా కార్డ్‌ను జోడించండిను ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీ సమాచారాన్ని మీరు ఎంటర్ చేసినప్పుడు, దిగువున పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- ఎడిట్ చేయండి:
- ఎంట్రీని ట్యాప్ చేయండి.
- మీ సమాచారాన్ని మార్చడం మీరు పూర్తి చేసినప్పుడు, దిగువున, పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- తొలగించండి:
- ఎంట్రీని ట్యాప్ చేయండి.
- ఎగువున, తొలగించండి
ని ట్యాప్ చేయండి.
- జోడించండి:
మీరు అడ్రస్‌ను జోడించినా, ఎడిట్ చేసినా లేదా తొలగించినా, మీ Google ఖాతాతో మీరు Chromeకు సైన్ ఇన్ చేసినట్లయితే, మీరు అదే ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేసిన మీ ఇతర పరికరాలలో మీ మార్పులు కనిపిస్తాయి.
Google Payలో మీ పేమెంట్ ఆప్షన్ సేవ్ చేసి ఉంటే, మీరు దాన్ని ఇప్పటికీ Google Payలో ఎడిట్ చేయడం లేదా తొలగించడంచేయాల్సి ఉంటుంది.
Chromeలో మీ పేమెంట్ ఆప్షన్‌కు మారుపేరు పెట్టండి
ముఖ్య గమనిక: మీరు పేమెంట్ ఆప్షన్‌ను Google Payలో సేవ్ చేసినట్లయితే ఈ దశలు పని చేయవు.
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి .
- అడ్రస్ బార్‌కు కుడివైపున, మరిన్ని
సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- ఇప్పటికే ఉన్న పేమెంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- దిగువున, మారుపేరును ట్యాప్ చేయండి.
- మీ పేమెంట్ ఆప్షన్‌కు మారుపేరును ఎంటర్ చేసి, పూర్తయిందిని ట్యాప్ చేయండి.
- మీరు సేవ్ చేసిన పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించినప్పుడల్లా ఈ మారుపేరు కనిపిస్తుంది.
చిట్కాలు:
- మీరు పేమెంట్ ఆప్షన్‌కు చెందిన పేరును మార్చినట్లయితే, సేవ్ చేసిన పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించే ఫారమ్‌ను మీరు ఎంచుకున్నప్పుడు ఇది కనిపిస్తుంది.
- Chrome పేమెంట్ ఆప్షన్ మారుపేర్లు Google Payకి బదిలీ అవ్వవు. మీ పేమెంట్ సమాచారాన్ని మీరు Google Payలో సేవ్ చేస్తే, దానిని మీరు విడిగా అప్‌డేట్ చేయాలి.
ఫారమ్‌లను పూరించడానికి మీ వేలిముద్ర లేదా ముఖాన్ని ఉపయోగించండి
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని
సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- స్క్రీన్ లాక్ అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
Google Payలో మీ పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేయండి
మీరు Chromeకు సైన్ ఇన్ చేసి, ఆన్‌లైన్ ఫారమ్‌లో మీ పేమెంట్ ఆప్షన్‌ను మీరు ఎంటర్ చేసినప్పుడు, ‘మీ పేమెంట్ సమాచారాన్ని మీరు Google Payలో సేవ్ చేయాలనుకుంటున్నారా’ అని Chrome అడగవచ్చు. మీరు ఆమోదించినట్లయితే, మీ పేమెంట్ సమాచారం Google Payలో సేవ్ చేయబడుతుంది. మీ పేమెంట్ ఆప్షన్‌ను Google Pay సపోర్ట్ చేయకపోతే, మీ పరికరంలోనే దాన్ని సేవ్ చేసే సదుపాయాన్ని Chrome అందించవచ్చు.
Google Payలో సేవ్ చేసిన పేమెంట్ ఆప్షన్‌లు, చాలా ఆన్‌లైన్ ఫారమ్‌లలో సూచనలుగా కనిపిస్తాయి.
Google Payలో మీ పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేసే సదుపాయాన్ని Chrome అందించకపోతే, Chromeలో సేవ్ చేసిన పేమెంట్ సమాచారంతో ఎదురైన సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.
- wallet.google.comకు వెళ్లండి.
- పేమెంట్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఎడిట్ చేయండి: పేమెంట్ ఆప్షన్‌కు దిగువున, ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
- తొలగించండి: పేమెంట్ ఆప్షన్‌కు దిగువున, తీసివేయండిని ట్యాప్ చేయండి.
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని
సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- ఎగువున, మీ ఖాతా పేరును ట్యాప్ చేయండి.
- Google Payలో సేవ్ అయిన పేమెంట్ ఆప్షన్‌లు, ఆఫర్‌లు, అడ్రస్‌లు అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని
సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లు లేదా అడ్రస్‌లు, ఇంకా మరిన్ని ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేయడాన్ని ఆపివేయడానికి, పేమెంట్ ఆప్షన్‌లను సేవ్ చేసి, పూరించండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
- అడ్రస్‌లను, కాంటాక్ట్ సమాచారాన్ని సేవ్ చేయడాన్ని ఆపివేయడానికి, అడ్రస్‌లను సేవ్ చేసి, పూరించండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
Chromeలో కార్డ్ సెక్యూరిటీ కోడ్‌లను మేనేజ్ చేయండి
మీరు మొదటిసారి మర్చంట్ సైట్‌లో మీ పేమెంట్ సమాచారాన్ని ఎంటర్ చేసినప్పుడు, మీ పేమెంట్ సమాచారంతో పాటు మీ సెక్యూరిటీ కోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సేవ్ చేసిన తర్వాత, మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు మీ పేమెంట్ సమాచారంతో పాటు CVV కోడ్ ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతుంది.
సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- ఎగువ కుడి వైపు, సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
-
సెక్యూరిటీ కోడ్‌లను సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీ Google ఖాతాలో స్టోర్ చేసిన కార్డ్‌ల విషయంలో, మీ కార్డ్ సెక్యూరిటీ కోడ్‌ను అప్‌డేట్ చేయడానికి రెండు మార్గాలున్నాయి:
- మీరు Chromeలోని ఎదైనా వ్యాపారి వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసినప్పుడు, మీ కార్డ్ సమాచారాన్ని, కొత్త సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. అప్‌డేట్ అయిన సెక్యూరిటీ కోడ్‌ను Chrome గుర్తించి, “సెక్యూరిటీ కోడ్‌ను సేవ్ చేయాలని” అనుకుంటున్నారేమో అడుగుతూ మీకు ఒక ప్రాంప్ట్ చూపుతుంది.సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- Remove the card from wallet.google.com . Then, use the same card to make a purchase on Chrome. Save the card again when prompted. This time, it will be saved with the security code.
- మీ పరికరాలలో ఒక దానిలో మాత్రమే సేవ్ అయ్యే కార్డ్‌ల విషయంలో, ఎడిట్ చేయాల్సిన కార్డ్‌ను ట్యాప్ చేయండి.
- మీ Google ఖాతాలో స్టోర్ చేసిన కార్డ్‌ల విషయంలో, మీ కార్డ్ సెక్యూరిటీ కోడ్‌ను అప్‌డేట్ చేయడానికి రెండు మార్గాలున్నాయి:
చిట్కా: సెక్యూరిటీ కోడ్‌లను ఎడిట్ చేయడానికి, “సెక్యూరిటీ కోడ్‌లను సేవ్ చేయండి” సెట్టింగ్ ఆన్‌లోనే ఉందని నిర్ధారించుకోండి.
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు
పేమెంట్ ఆప్షన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
అన్ని కార్డ్‌లకు సంబంధించిన సెక్యూరిటీ కోడ్‌లను మీ పరికరాలు, Google ఖాతా నుండి తొలగించడానికి:
-
సేవ్ చేసిన సెక్యూరిటీ కోడ్‌లను తొలగించండి
తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ పరికరాలలో ఒక దానిలో మాత్రమే సేవ్ అయి ఉన్న కార్డ్‌లకు సంబంధించిన సెక్యూరిటీ కోడ్‌లను తొలగించడానికి:
-
మీ పేమెంట్ సమాచారాన్ని ఎడిట్ చేయడానికి కార్డ్‌పై ట్యాప్ చేయండి.
- సెక్యూరిటీ కోడ్‌ను తొలగించండి.
- పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీరు సెక్యూరిటీ కోడ్‌లను జోడిస్తే, ఎడిట్ చేస్తే లేదా తొలగిస్తే, అలాగే మీరు మీ Google ఖాతాతో Chromeకి సైన్ ఇన్ చేసి ఉంటే, మీరు చేసే మార్పు ఏదైనా అదే ఖాతాతో మీరు Chromeకి సైన్ ఇన్ చేసిన మీ ఇతర పరికరాలలో ప్రతిబింబిస్తుంది.
"ఆటోఫిల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ వెరిఫై చేయండి" సెట్టింగ్‌ను మేనేజ్ చేయండి
ముఖ్య గమనిక: ఇది పరికర-స్థాయి సెట్టింగ్. మీరు ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయాలనుకుంటున్న ప్రతి పరికరం కోసం దీన్ని తప్పనిసరిగా ఆన్ చేయాలి.
మీ పరికరాన్ని షేర్ చేస్తున్నప్పుడు ఇతరులు మీ పేమెంట్ సమాచారాన్ని ఉపయోగించకుండా నిరోధించడానికి, మీరు ఆటోఫిల్‌ను ఉపయోగించినప్పుడు వెరిఫికేషన్‌ను ఆన్ చేయవచ్చు. ఈ సెట్టింగ్‌తో, మీరు మీ సెక్యూరిటీని పెంచుకుని, మోసపూరిత యాక్టివిటీల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని
సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- పేమెంట్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
- ఆటోఫిల్‌ను ఉపయోగించినప్పుడల్లా వెరిఫై చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
ఈ సెట్టింగ్ లేత బూడిదరంగులో ఉండి, మీరు దాన్ని ఆన్ చేయలేకుంటే, వీటిని చెక్ చేయండి:
- మీ పరికరానికి స్క్రీన్ లాక్ ఉందని నిర్ధారించుకోండి. ఈ సెట్టింగ్‌ను ఉపయోగించడానికి, మీరు స్క్రీన్ లాక్‌ను సెటప్ చేశారని నిర్ధారించుకోండి.
- “పేమెంట్ ఆప్షన్‌లను సేవ్ చేసి, పూరించండి” ఆప్షన్ ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి.
సేవ్ చేసిన మీ సమాచారాన్ని సూచించడంలో Chromeతో మీకు సమస్యలు ఉంటే
- ఆటోమేటిక్‌గా ఆటో-ఫిల్ అవ్వని సమాచారాన్నే మీరు సేవ్ చేశారని నిర్ధారించుకోవడానికి: మరిన్ని
సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- Chrome నుండి ఈ సమాచారాన్ని పొందడానికి వెబ్‌సైట్ తగినంత సురక్షితంగా ఉండకపోవచ్చు.
- వెబ్‌సైట్ సురక్షితంగా ఉన్నప్పటికీ, ఫారమ్‌లో కొన్ని ఫీల్డ్‌లను Chrome గుర్తించలేకపోవచ్చు.
సేవ్ చేసిన మీ ఆటోఫిల్ ఫారమ్ సమాచారాన్ని Chrome నుండి తొలగించండి
మీ అడ్రస్‌లు, పేమెంట్ ఆప్షన్‌లు, లేదా ఇతర సేవ్ చేసిన సమాచారాన్ని Chrome నుండి ఒకేసారి తొలగించడానికి:
- మీ Android పరికరంలో, Chrome
ను తెరవండి.
- పైన కుడి వైపున, మరిన్ని
సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- గోప్యత, సెక్యూరిటీ
బ్రౌజింగ్ డేటాను తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- "చివరి గంట" లేదా "మొత్తం సమయం" వంటి సమయ పరిధిని ఎంచుకోండి.
- "అధునాతన సెట్టింగ్‌ల"లో, ఆటోఫిల్ అయిన ఫారమ్ డేటా అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- డేటాను తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఈ ఆప్షన్ Google Payలో స్టోర్ చేసిన పేమెంట్ సమాచారాన్ని, అడ్రస్‌లను తొలగించదు. Google Payలో పేమెంట్ ఆప్షన్‌ను తీసివేయడం ఎలాగో తెలుసుకోండి.
మీ ఆటోఫిల్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి
Android డివైజ్‌లలోని Chromeలో ఫారమ్‌లను ఆటోమేటిక్‌గా ఫిల్ చేయడానికి మీరు Google లేదా వేరొక ఆటోఫిల్ ప్రొవైడర్‌ను దేనినైనా ఎంచుకోవచ్చు.
ముఖ్య గమనిక: మీరు Chromeలో వేరొక ఆటోఫిల్ సర్వీస్‌ను ఎంచుకున్నట్లయితే, ఆటోఫిల్ డేటా అనేది Googleకు బదులుగా థర్డ్-పార్టీ Password Manager నుండి తీసుకోబడుతుంది. వేరొక ఆటోఫిల్ సర్వీస్‌ను ఉపయోగించడానికి, మీరు ముందుగా Android సెట్టింగ్‌లలో సర్వీస్‌ను జోడించాలి.
మీ ప్రాధాన్య ఆటోఫిల్ సర్వీస్‌ను ఎంచుకోవడానికి:
- మీ Android డివైజ్‌లో, Chrome
ను తెరవండి.
- పైన కుడి వైపున, మరిన్ని
సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- ఆటోఫిల్ సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- Google Password Managerను, Chrome ఆటోఫిల్‌ను ఉపయోగించడానికి, Googleతో ఆటోఫిల్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- Chromeలో వేరొక ఆటోఫిల్ సర్వీస్‌ను ఉపయోగించడానికి, వేరొక సర్వీస్‌ను ఉపయోగించి ఆటోఫిల్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- సెట్టింగ్ మార్పును నిర్ధారించడానికి, Chromeను రీస్టార్ట్ చేయండిని ట్యాప్ చేయండి.
- ఇది మీ Chrome విండోను రీస్టార్ట్ చేస్తుంది.
- మార్పును రద్దు చేయడానికి, రద్దు చేయండిని ట్యాప్ చేయండి.